Thursday, November 29, 2018

Sri Rama Krishna Paramahamsa

0

విదేశీయులు గుళ్ళను కూల్చుంతుంటే దేవుడెందుకు ఆపలేదని, ఏదైనా గుళ్ళో దొంగతనం జరిగినప్పుడు అయ్యో! దేవుడేమీ కాపాడుకోలేకపోయాడే అంటారు. అలాంటి ఎన్నో సందేహాలను పటాపంచలు చేసి సంవాదం ఇది. శ్రీ రామకృష్ణుల జీవిత చరిత్ర నుంచి స్వీకరించబడినది. ఇది ఒకరమైన జ్ఞానగుళిక.


భగవంతుడిని ధ్యానించండి, ఆయన మహిమలను కాదు

కేశబ్‌తో శ్రీ రామకృష్ణులు - బ్రహ్మసమాజం సభ్యులెందుకు ఎక్కువగా దైవం యొక్క మహిమలను ధ్యానిస్తారు? 'ఓ భగవంతుడా, నువ్వు చంద్రుడిని, సూర్యుడిని, నక్షత్రాలను సృష్టించావ్!' అంటూ వాటిని వల్లెవేయాల్సిన అవసరం ఉందా? చాలామంది తోటను చూడటానికి ఇష్టపడుతున్నారే కానీ దాని యజమానికి తెలుసుకోవాలన్న తపన కొందరికి మాత్రం ఉంది. ఎవరు గొప్ప, తోటా? లేక దాని యజమానా?

కొంత సారాయి తాగిన తర్వాత, గ్యాలన్ల కొద్ది వైన్ ,నిలువలు ఉంటే ఎవరికి కావాలి? ఒక బాటిల్ చాలు నాకు.
నేను నరేంద్రను కలిసినప్పుడు, 'మీ నాన్నగారు ఎవరు? ఆయనకు ఎన్ని ఇళ్ళున్నాయి?' నేను అడగలేదు.
నేనొక సత్యం చెప్పనా? మనిషి తన సంపదలను ఇష్టపడతాడు, అందుకే భగవంతుడు కూడా ఇష్టపడతాడని తలుస్తాడు. దైవం యొక్క మహిమలను స్తుతిస్తే ఆయన సంతోషిస్తాడని భావిస్తాడు. ఒకసారి నాతో శంభు అన్నాడు - 'నా సంపదలను భగవంతుని పాదపద్మాల వద్ద విడిచి మరణించేలా దయతో నన్ను దీవించండి'. నేనన్నాను 'ఇవన్నీ నీకు మాత్రమే సంపదలు. నువ్వు భగవంతునికి ఏ సంపదలు అర్పించగలవు? ఆయనకు ఇవన్నీ కేవలం దుమ్ముతో సమానం మరియు తృణప్రాయము.

ఒకసారి విష్ణువు ఆలయంలో దొంగలుపడి, ఆ మూర్తి యొక్క ఆభరణాలు దొంగిలించారు. అసలు సంగతి తెలుసుకుందామని మథుర్ బాబు మరియు నేను వేళ్ళాము. విగ్రహాన్ని ఉద్దేశించి మథుర్ బాబు కటువుగా 'భగవంతుడా, ఎంత సిగ్గుచేటు! నువ్వు నిరర్థకుడివి! దొంగ నీ శరీరం నుంచి ఆభరణాలన్నీ తీసుకున్నాడు, కానీ నువ్వు మాత్రం ఏం చేయలేకపోయావు' అన్నాడు. అప్పుడు నేను మథుర్‌తో 'నువ్వు సిగ్గుపడాలి. ఎంత అసంబద్ధంగా మాట్లాడుతున్నావు. భగవంతునికి, నువ్వు ఎంతగానో చెప్తున్న ఈ ఆభరణాలు మట్టి ముద్దలతో సమానం. సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీ ఆయన ఇల్లాలు. ఒక దొంగ కొన్ని రూపాయలు తీసుకున్నాడని ఆయన నిద్రలేని రాత్రులు గడపాలని నువ్వంటున్నావా? నువ్విలాంటి మాటలు మాట్లాడకూడదు'.

ఎవరైన భగవంతుని తన సంపద ద్వారా నియంత్రణలోకి తెచ్చుకోగలరా? ఆయన్ను #ప్రేమ ద్వారా మాత్రమే పొందగలము. ఆయనకేమి కావాలి? ఖచ్ఛితంగా సంపద కాదు! ఆయనకు ఆయన భక్తుల నుంచి భక్తి, భావం, #వివేకము, వైరాగ్యం కావాలి.

శ్రీ రామకృష్ణ పరమహంస


0 comments:

Post a Comment